ఈరోజు బంగారం ధరలు ఇవే
బంగారాన్ని ఒక విలువైన వస్తువుగా చూస్తారు. బంగారం ఎంత ఉంటే అంత గౌరవ ప్రతిష్టలు లభిస్తాయన్నది భారతీయుల విశ్వాసం
బంగారం అంటే భారతీయులుకు మహా ప్రీతి. బంగారాన్ని ఒక విలువైన వస్తువుగా చూస్తారు. బంగారం ఎంత ఉంటే అంత గౌరవ ప్రతిష్టలు లభిస్తాయన్నది భారతీయుల విశ్వాసం. ముఖ్యంగా మహిళలు తమ మేనికి మరింత సొబగులు అద్దేందుకు బంగారు ఆభరాణలు ఎంతో ఉపకరిస్తాయని భావిస్తారు. అందుకే భారత్ లో బంగారానికి ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది. దుబాయ్ వంటి దేశాల నుంచి బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేయడం కూడా అందుకే. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
వెండి ధరలు కూడా...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రకూ.100ల వరకూ పెరిగింది. కిలో వెండి పై రూ.500లు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,130 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,950 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 61,800 రూపాయలుగా ఉంది.