కనకం కనికరించిందే

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి

Update: 2023-01-26 02:47 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. దానికి అనేక కారణాలు చెబుతుంటారు. కారణాలు చెబితే కొనుగోళ్లు ఆగుతాయా? అంటే ఏమీ ఉండదు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి ఎప్పుడూ విలువ ఉంటుంది. దాని వన్నె తగ్గన్నట్లుగానే డిమాండ్ కూడా తగ్గదు. ఎందుకంటే ధరను బట్టి దానిని కొనుగోలు చేయరు. అవసరాన్ని బట్టి కొనుగోలు చేస్తారు. అలంకార వస్తువుగానే కాకుండా పెట్టుబడిగా కూడా కొందరు చూస్తుండటంతో బంగారం కొనుగోళ్లు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. దిగుమతులు కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వల్లనే ధరలు పెరుగుతున్నాయన్న వాదన కూడా లేకపోలేదు. ధరల పెరుగుదల కూడా బంగారం డిమాండ్ ను తగ్గించడం లేదంటున్నారు వ్యాపారులు.

నిలకడగానే...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం కొంత నిలకడగా ఉండటం శుభపరిణామమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,700 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,490 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News