నేడు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

దేశంలో ఈరోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతుంది

Update: 2023-01-09 03:12 GMT

బంగారం, వెండి ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. భారత్ లో అది మామూలుగా మారిపోయింది. భారత్ లోనే ఎక్కువగా బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తారు. మిగిలిన దేశాల్లో ఎక్కువగా బాండ్ల రూపంలో కొనుగోలు చేయడం అలవాటు. కానీ మనోళ్లకు సంప్రదాయం ప్రకారం బంగారాన్ని వస్తువు రూపంలో కొనుగోలు చేయడమే అలవాటుగా మారింది. దీంతో ప్రపంచ దేశాల్లో భారత్ అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే విధంగా ఉంది. ప్రపంచలో ఉన్న బంగారం నిల్వల్లో 11 శాతం బంగారం భారత్ లోనే ఉందంటున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. దక్షిణ భారత దేశంలోనే బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నాలుగైదు రాష్ట్రాల్లోనే ఎక్కువ కొనుగోళ్లుంటాయని చెబుతున్నారు.

నిలకడగా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతుంది. రాను రాను ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,960 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,300 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News