గోల్డ్ ఓకే... షాకిచ్చిన సిల్వర్

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండిపై రూ.5400లు పెరిగింది

Update: 2022-09-12 02:35 GMT

బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఎక్కువ సార్లు పెరగుగుతుంటాయి. తక్కువ సార్లు తగ్గుతాయి. అయితే ఇందుకు కారణాలు ఏమిటో చెప్పలేం. డాలర్ విలువ తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు. అంతేకాదు కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటివి కూడా ధరల్లో పెరగడానికి, తగ్గడానికి కారణం కావచ్చు. కానీ ధరలను బట్టి బంగారాన్ని కొనుగోలు చేసే పద్ధతి ఎప్పుడో పోయింది. ఎప్పుడు తమ చేతుల్లో డబ్బులుంటే అప్పుడే కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లకు సీజన్ లేకుండా పోయింది. గతంలో మంచిరోజులు చూసి మరీ బంగారాన్ని కొనే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు అదేమీ లేదు. పెళ్లిళ్ల సీజన్ లేదు. శుభకార్యాలని కాదు. తమ వద్ద సొమ్ములున్నప్పుడే పసిడి వైపు చూసే రోజులివి. అందుకే బంగారానికి నిత్యం డిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది.

స్థిరంగా బంగారం ధరలు...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండిపై రూ.5400లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,000 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,750 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 60,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News