బంగారం కొనాలంటే.. ధరలు ఇలా
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. వెండి కిలో పై రూ.400లు తగ్గింది
బంగారం మహా ప్రియంగా మారిపోయింది. బంగారం ధరలు అంటేనే ఒకరోజు పెరుగుతుంటాయి. మరొక రోజు తగ్గుతుంటాయి. పెరిగితే భారీగా తగ్గితే స్వల్పంగా ఉండే బంగారం ధరలను చూసి పసిడి ప్రియులు షాక్ అవ్వాల్సిందే. బంగారం రోజూ కొనుగోలు చేసే వస్తువు కాదు. నెలవారీ నిత్యవాసర సరుకు కాదు. అత్యవసరమైనది అంతకంటే కాదు. కానీ బంగారానికి ఉన్న డిమాండ్ మాత్రం ఎప్పుడు తగ్గదు. కేవలం పెళ్లిళ్ల సీజన్ లోనూ, శుభకార్యాల కోసమే బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. భారతీయ సంప్రదాయ వస్తువుగా మాత్రమే భావించే బంగారం ధరలు నానాటికి అందకుండా పోతున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి భారీగా తగ్గి...
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది కొంత కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశమే. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. వెండి కిలో పై రూ.400లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,980 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,560 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర తగ్గి ప్రస్తుతం 68,100 రూపాయలుగా కొనసాగుతుంది.