నేటి బంగారం ధరలు ఇవే

ఈరోజు బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గతకొద్ది రోజులుగా పెరిగిన ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

Update: 2022-11-15 03:16 GMT

బంగారం ధరలకు కళ్లెం పడటం లేదు. భారీగా పెరుగుతుంది. యాభై మూడు వేలకు చేరువలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. బంగారం అంటేనే అంత. ఎప్పుడు ధరలు పెరిగినా భారీగా పెరుగుతాయి. తగ్గితే స్వల్పంగా తగ్గుతాయి. ఈ సంగతి కొనుగోలుదారులకు తెలియంది కాదు. అయినా ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్యణం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతుంటారు.

నిలకడగా కొనసాగుతున్న....
ఈరోజు బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గతకొద్ది రోజులుగా పెరిగిన ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా ఉన్నాయి. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,640 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,260 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 67,700లు గా ఉంది.


Tags:    

Similar News