ధరలు తగ్గాయి... కానీ?

ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.350 ల వరకూ తగ్గింది

Update: 2022-12-16 04:12 GMT

బంగారం ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు బంగారం మరింత దూరమవుతుంది. రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం అపురూపమైన వస్తువుగానే మిగిలిపోయింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతుంటారు. రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. బంగారం ధరలు తగ్గితే స్వల్పంగా, పెరిగితే భారీగా ఉండటంతో ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర అరలక్షకు చేరుకుంది.

వెండి ధరలు కూడా...
తాజాగా ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.350 ల వరకూ తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి పై రూ.1300ల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,530 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,900 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర కొంత తగ్గి ప్రస్తుతం 72,700 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News