పసిడిప్రియులకు ఊరట
బంగారం ధరలు ఈరోజు దేశంలో తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.380లు తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది.
బంగారం ధరలు తగ్గాయంటే సంతోషం కాక మరేముంటుంది? అదీ స్వల్పంగా తగ్గినా, స్థిరంగా కొనసాగినా సంబరపడిపోతారు. కొనుగోలుదారులు బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని వెయిట్ చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరుగుతాయన్న మార్కెట్ నిపుణుల హెచ్చరికలతో బంగారం ధరలు ఈ ఏడాది డెబ్భయి వేలకు చేరుకుంటాయని భయపడుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు. పెట్టుబడిగా బంగారాన్ని చూసేవారంతా తగ్గినప్పుడే కొనుగోలు చేస్తుంటారు. ఇక దక్షిణ భారతదేశంలో బంగారం ఆభరణాలు కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో ధరలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు.
వెండి కూడా...
ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు ఈరోజు దేశంలో తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.380లు తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధరపై రూ.600లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,950 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,980 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 80,000 రూపాయలుగా ఉంది.