బంగారం ధరలు నేడు

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై వంద రూపాయల వరకూ తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది

Update: 2022-11-08 03:06 GMT

బంగారం అంతే. బంగారం ధరలు పెరిగితే భారీగా పెరుగుతాయి. తగ్గితే మాత్రం స్వల్పంగా తగ్గుతుంది. ఈ సంగతి కొనుగోలుదారులకు తెలియంది కాదు. తగ్గిందని సంబరపడటానికి ఏమీ లేదు. అలా పెరిగిందని బాధపడటానికి కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం అంటే భారతీయ మహిళలు ఎక్కువ ఇష్టపడతారు. అందుకే ఇక్కడ బంగారం అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

వెండి కూడా...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై వంద రూపాయల వరకూ తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,160 రూపాయలుగా కొనసాగుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,900 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 66,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News