పసిడిప్రియులకు సంక్రాంతి కానుక

వరసగా మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి

Update: 2023-01-12 03:39 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. అయితే గత మూడు రోజుల నుంచి వరసగా కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది పసిడిప్రియులకు కొంత ఊరట కల్గించే అంశంగానే చెప్పుకోవాలి. సంక్రాంతి పండగ రోజు పసిడి ధరలు తగ్గడంతో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పసిడి ధర ఎప్పడూ నిలకడగా ఉండదు. రోజువారీగా ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. పెరిగితే అధికంగా, తగ్గితే స్వల్పంగా బంగారం ధరలు ఉంటాయి. అయినా ధరలతో సంబంధం లేకుండా, సీజన్ తో పనిలేకుండా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడంతో సహజంగానే ధరలు పెరుగుతాయంటున్నారు మార్కెట్ నిపుణులు.

మూడు రోజులుగా...
వరసగా మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,300 రూపాయల వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,950 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర 74,000 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News