హమ్మయ్య.. బంగారం ధరలు తగ్గాయి
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతుండటం పసిడిప్రియులకు ఊరల కలిగించే విషయమే
బంగారం ధరలు ఎందుకోగాని రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతున్నాయి. అంతకు ముందు మూడు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుముఖంపట్టాయి. పెళ్లిళ్ల సీజన్ దేశమంతా ప్రారంభమయింది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. వివాహాల సీజన్లలో బంగారానికి మామూలు రోజులు కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే భారీగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేసి చెప్పారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు కూడా బంగారం ధరల్లో మార్పులకు కారణంగా చెబుతుంటారు.
వెండి మాత్రం...
ఏదిఏమైనా గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతుండటం పసిడిప్రియులకు ఊరల కలిగించే విషయమే. అదే సమయంలో వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండిపై రూ.400లు పెరగింది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,050 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,800 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 66,700 రూపాయలుగా ఉంది.