షాకింగ్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి

Update: 2022-09-10 02:27 GMT

బంగారం అంటేనే అంతే. దాని విలువ ఎప్పటికీ తరగదు. వితువల తగ్గని వస్తువు కావడంతో ఎక్కువ మంది బంగారంపై మక్కువ చూపుతారు. ఆభరణాలుగా భావించే రోజులు పోయినా.. దానిని పెట్టుబడిగా చూస్తూ కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అందుకే బంగారానికి భారత్ లో అంత డిమాండ్. ధరలతో సంబంధం లేకుండా తమ స్థాయికి తగినట్లు కొనుగోలు చేయడం అలవాటుగా మారిపోయింది. గతంలో శుభకార్యాలకు మాత్రమే కొనుగోలు చేసే బంగారం ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. అందుకే భారత్ లో బంగారానికి ఎప్పటికీ డిమాండ్ తగ్గే పరిస్థితి కనిపించదు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వల కారణంగా బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటాయి.

ధరలు ఇలా...
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. వెండి కిలో పై రూ.800లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంధర 51,000 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,750 రూపాయలుగా ఉంది. ఇక హైదరాాద్ మార్కెట్ లో కిలో వెండి 60,300 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News