పెరగడమే తప్ప తగ్గేదెప్పుడు?

గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి

Update: 2023-01-16 03:05 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. పెరుగుదలను పెద్దగా పట్టించుకోని పసిడి ప్రియులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో వాటి డిమాండ్ ఎంతమాత్రం తగ్గడం లేదు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు పెరుగుతాయని తెలిసి పెట్టుబడి రూపంలో కొనుగోలు చేసే వారు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. ఈ ఏడాది తులం బంగారం 70 వేలకు చేరుకుంటుందన్న మార్కెట్ నిపుణుల అంచనాతో కొనుగోళ్లు మరింత పెరిగాయంటున్నారు.

నిలకడగా వెండి....
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి మాత్రం నిలకడగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,000 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,730 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,000 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News