స్థిరంగా బంగారం ధరలు

గత రెండు రోజులుగా బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆషాఢమాసం కావడంతో కొంత కొనుగోళ్లు తగ్గాయి.

Update: 2022-07-10 02:51 GMT

బంగారం కొనాలంటే ఈరోజుల్లో గగనమై పోయింది. సామాన్యులకు అందనంత దూరంలో ధరలు ఉండటమే ఇందుకు కారణం. రోజరోజుకూ పెరుగుతున్న ధరలతో బంగారం సామాన్యులకు దూరమయిందనే చెప్పాలి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకూ కోరకునేది.. ఇష్పపడేది బంగారాన్నే. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఎక్కువగా ఇష్పపడతారు. అందుకే బంగారం ధర రోజురోజుకూ అందనంత పెరిగిపోతూ వస్తుంది. అయినా సరే బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. తాము దాచి పెట్టుకున్న కొంత మొత్తంతోనైనా బంగారం కొనుగోలు చేయడం అలవాటుగా మారడంతో ధరల మార్పుతో సంబంధం లేకుండా కొనుగోళ్లు, అమ్మకాలు సాగుతున్నాయి.

ధరలు ఇలా....
గత రెండు రోజులుగా బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆషాఢమాసం కావడంతో కొంత కొనుగోళ్లు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,210 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,950 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో కిలో వెండి ధర ప్రస్తుతం 62,800 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News