పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

దేశంలో బంగాంరం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ400 లు తగ్గింది

Update: 2022-07-16 02:16 GMT

బంగారం ధరలు హెచ్చుతగ్గులు ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి పెరిగితే, మరోసారి తగ్గడం మామాలే. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. అయితే ధరల హెచ్చు తగ్గుల ప్రభావం బంగారం కొనుగోళ్లు, అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపవు. ఎందుకంటే బంగారానికి భారత్ లో అంత డిమాండ్ ఉంది. భారతీయ సంస్కృతిలో బంగారం భాగమైపోవడంతో దాని విలువను పెద్దగా లెక్కలోకి తీసుకోలేరు. వినియోగం లేకపోయినా పెట్టుబడిగా చూస్తున్న వారు అధికం కావడంతో బంగారం ధరలు నింగినంటుతున్నాయి.

వెండి కూడా...
తాజాగా దేశంలో బంగాంరం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ400 లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,730 వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 46,500 రూపాయల వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 60,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News