గుడ్ న్యూస్... భారీగా తగ్గిన పసిడి

బంగారం ధరలు ఈరోజు దేశంలో తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.400లు తగ్గింది.

Update: 2022-07-22 04:11 GMT

బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. అందుకే ఏరోజు కారోజు ధరలను చూసి కొనుగోలు చేయాలనుకుంటారు. భారత్ లో పసిడికి ఉన్న డిమాండ్ తో బంగారం పై ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఒకసారి ధరలు స్వల్పంగా తగ్గితే, మరో రోజు భారీగా ధరలు పెరగడం ఒక్క బంగారం విషయంలోనే చూస్తుంటాం. అందుకే తగ్గిన సమయంలోనే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

తగ్గిన ధరలు ఇలా...
తాజాగా బంగారం ధరలు ఈరోజు దేశంలో తగ్గాయి. పది గ్రాముల బంగారం పై రూ.400లు తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఊరట కలిగించే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,180 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46 వేల రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 61,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News