బంగారం ధరలు ఇలా.. ఒక లుక్కేయండి
బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి మాత్రం భారీగా పెరిగింది. వెండి కిలో పై రెండు వేల వరకూ పెరిగింది.
బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇది మార్కెట్ నిపుణులు చెప్పే మాట. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అందుకే తక్కువగా ఉన్నప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ధర పెరిగితే భారీగా పెరుగుతుందని, తగ్గితే స్వల్పంగా తగ్గుండటం గమనిస్తునే ఉంటాం. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
వెండి భారీగా...
తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి మాత్రం భారీగా పెరిగింది. వెండి కిలో పై రెండు వేల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,780 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,550 రూపాయలుగా కొనసాగుతంది. ఇక కిలో వెండి ధర 65,000 రూపాయలకు చేరుకుంది.