ఇప్పుడు కొనేస్తేనే మంచిదట

దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.200లు తగ్గింది. వెండి కూడా భారీగానే తగ్గింది.

Update: 2023-02-18 04:08 GMT

బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇది మదుపరులకు ఊరట నిచ్చే అంశమే. బంగారాన్ని పెట్టుబడిగా చూసే వారికి శుభవార్త అనే చెప్పాలి. ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత బంగారానికి అతికినట్లు సరిపోతుంది. ఒక్కసారిగా పెరిగిన ధరలతో కొనుగోలుదారులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తారు. తద్వారా డిమాండ్ తగ్గుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడి దుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు నింగినంటుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కస్టమ్స్ డ్యూటీ వీటిపై పెంచడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు. ఈ ఏడాది తులం బంగారం డెబ్బయి వేలకు చేరుకుంటుందన్న అంచనాలు కూడా వినిపించాయి. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధరలు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయి.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.200లు తగ్గింది. వెండి కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి పై రూ.400లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,800 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,510 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 71,200 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News