అక్షర తృతీయకు అదిరిపోయే న్యూస్

దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.300లు తగ్గింది.

Update: 2023-04-23 03:57 GMT

అక్షర తృతీయ అంటేనే బంగారం ధరలు మండిపోతాయి. జనాలు క్యూ కట్టి మరీ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అదొక సెంటిమెంట్. బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గేది తక్కువ సార్లు మాత్రమే. బంగారం ధరలు పెరిగేది అధికంగా, తగ్గేది స్వల్పంగా అని అందరికీ అర్థమయినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. పసిడి ప్రేమికులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువే. అంతేకాకుండా పెట్టుబడిగా చూసే వారు అనేక మంది ఉన్నారు. బంగారం ధరలు భవిష్యత్‌లో మరింత పెరుగుతాయని భావించి డబ్బులు ఉన్నప్పుడు కొనుగోలు చేస్తుంటారు. అవసరమైనప్పుడు బంగారాన్ని డబ్బులుగా మార్చుకోవడం సులువు కావడంతో బంగారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అలవాటుగా మార్చుకున్నారు. అందుకే బంగారం కొనుగోళ్లు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగవు. ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం కూడా బంగారం కొనుగోళ్లు ఎక్కువగానే జరుగుతుంటాయి.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.300లు తగ్గింది. కిలో వెండి ధరపై రూ.700లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,750 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,820 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 80,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News