గోల్డ్ రేట్స్ పైపైకి.. మహిళలకు షాక్

బంగారం ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై 110 రూపాయలు పెరిగింది.

Update: 2022-07-20 02:36 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. బంగారాన్ని కొనుగోలు చేయడానికి భారతీయులు ఎలాంటి సమయం చూడరు. తమ చేతుల్లో కాసులుంటే తొలుత బంగారం కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తారు. పసిడికి భారతీయులు ఫిదా అవుతుంది ఇప్పటి నుంచి కాదు. పండగలు, ఇంట్లో శుభకార్యాలయాలకు బంగారం ప్రతి ఇంట్లో ఒక వస్తువుగా మారిన నాడే దానికి డిమాండ్ పెరిగింది. ఇక భారతీయ మహిళ ఆభరణాలుగా బంగారమే ఉండాలని ఎక్కువగా కోరుకుంటుంది. దీంతో పాటు ఇటీవల కాలంలో భూమితో పాటు బంగారాన్ని కూడా పెట్టుబడిగా చేస్తున్నారు. అందువల్లనే భారత్ లో బంగారానికి డిమాండ్ ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం ఒక్క బంగారం విషయంలోనే సాధ్యమవుతుందని మార్కెట్ నిపుణులు కూడా చెబుతారు.

ధరలు ఇలా....
తాజాగా బంగారం ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం పై 110 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,300 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,500 రూపాయలుగా ఉంది. మరోవైపు వెండి ధర తగ్గింది. కేజీకి వెయ్యి రూపాయలు తగ్గడంతో మార్కెట్ లో కేజీ వెండి 55,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News