షాకింగ్.... పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై 400 రూపాయలు పెరిగింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.

Update: 2022-07-23 02:17 GMT

బంగారం అంటేనే భారత్ లో ఎక్కువ మందికి మహా ప్రీతి. కాసినన్ని కాసులుంటే చాలు కాసు బంగారానైన్నా కొనుగోలు చేయాలనుకుంటారు. అలాంటి మనస్తత్వం భారతీయ మహిళలది. అదే వీక్‌నీస్ ను వ్యాపారులు సొమ్ములు చేసుకుంటున్నారు. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వాయిదా పద్ధతులు కూడా కల్పిస్తున్నారు. దీంతో బంగారం కొనుగోలు సులభతరమయింది. ప్రతి నెలా కొంత పొదుపు చేసి బంగారం కొనుగోలు చేయడం సులువుగా మారింది. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్. బంగారం ధరల్లో మార్పులను పెద్దగా పట్టించుకోరు, పెరిగినా, తగ్గినా తమ వద్ద డబ్బులు ఉంటే బంగారాన్ని కొనుగోలు చేయడానికే భారతీయుల ప్రాధాన్యత ఇస్తారు.

వెండి మాత్రం...
తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై 400 రూపాయలు పెరిగింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,620 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 61,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News