షాకింగ్.. మళ్లీ పెరిగిన బంగారం ధర

దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై దాదాపు రూ.250ల వరకూ పెరిగింది.

Update: 2022-08-06 02:56 GMT

బంగారం అంటే భారత్ లో ప్రీతి. సంస్కృతి సంప్రదాయంలో భాగంగా బంగారం ఒక ఇంటి వస్తువుగా మారిపోయింది. ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండే బంగారానికి మహిళలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే బంగారం ధరలు ఎప్పుడూ అందనంత దూరంలో ఉంటాయి. అయినా సరే కొనుగోలుదారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇందుకు కారణం బంగారాన్ని కొని పెట్టుకుంటే ఎప్పటికైనా తమ అవసరాలకు ఉపయోగపడుతుందని భావించడమే. అందుకే బంగారాన్ని పెట్టుబడిగా చూస్తున్నారు.

వెండి ధర....
తాజాగా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై దాదాపు రూ.250ల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,980 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,650 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 63,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News