కొనాలంటే.. ఆలోచించాల్సిందే

దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.100లు పెరిగింది

Update: 2022-12-27 04:18 GMT

బంగారం ధరలు అంతే మరి. ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. నెలలో ఇరవై రోజులు ధరలు పెరిగితే పదిరోజుల్లో కొన్ని రోజులు స్వల్పంగా తగ్గి, మరికొన్ని రోజులు స్థిరంగా కొనసాగుతాయి. బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి ధరల పెరుగుదలను పెద్దగా పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. అందుకే బంగారం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందని వస్తువుగా మారిపోయింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారాన్ని కేవలం ఆభరణాలుగా మాత్రమే చూడకుండా పెట్టుబడిగా కూడా చూస్తుండటంతో డిమాండ్ అధికంగా ఉంటుంది.

వెండి కూడా...
తాజాగా పసిడిప్రియులకు బంగారం ధరలు షాకిచ్చాయి. దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.100లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,480 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,950 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News