పసిిడి మరింత ప్రియం
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.500లు పెరిగింది. వెండిపై రూ.300లు పెరిగింది
బంగారం అంటేనే అంతే మరి. ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. దాదాపు రోజూ ధరలు పెరుగుతూనే ఉంటాయి. బంగారానికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలు పెరుగుతూ ఉంటాయి. భారతీయ సంస్కృతిలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటంతో బంగారానికి విలువ పెరగడంతో పాటు ధరలు కూడా పెరుగుతున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో పాటు బంగారం దిగుమతులను భారత ప్రభుత్వం తగ్గించడం కూడా ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.500లు పెరిగింది. ఇక వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. వెండి కిలోపై రూ.300లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,180 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 82,800 రూపాయలుగా నమోదయింది.