వామ్మో... బంగారం... ధరలు... కారణమిదే
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. పది గ్రాముల బంగారం ధరపై రూ.1800లు పెరిగింది
బంగారం మహిళల అందానికి మరింత మెరుగులు అద్దుతుంది. గౌరవం తెస్తుంది. అతివలు ఇష్టపడే అతి ముఖ్యమైన వస్తువుల్లో బంగారం ఒకటి. ఏది లేకున్నా ఒంటి మీద బంగారు ఆభరణాలు లేకుంటే వారికి అస్సలు నిద్రపట్టదు. ఇక ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు వెళ్లాలన్నా బంగారు ఆభరణలు ఖచ్చితంగా ధరించాల్సిందే. అటువంటి బంగారానికి భారత్ లో గతంలో ఎన్నడూ లేని డిమాండ్ ఇప్పుడు పెరిగింది. కొనుగోళ్లు కూడా పెరిగాయి. ఇక కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరల్లో మార్పులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ధరలు ఎంత పెరిగినా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. సీజన్లతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటం, ధరలను కొనుగోలుదారులుపెద్దగా పట్టించుకోక పోవడం వల్ల కూడా బంగారం వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు సాగుతున్నాయి.