షాకింగ్ న్యూస్ : బంగారం ఎంత పెరిగిందంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.200లు పెరిగింది. వెండి ధర మాత్రం కొంత తగ్గుముఖం పట్టింది.
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? తగ్గుతాయో చెప్పలేం. పెరిగినా, తగ్గినా భారతీయ సంప్రదాయాల ననుసరించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొనుగోళ్లు తప్పనిసరి అవుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్లకు బంగారం అవసరంగా మారింది. దీంతో భారతీయులు బంగారు ఆభరణాలను ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం రివాజుగా మారింది. అందుకే ధరలు పెరగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కానీ సీజన్‌తో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటం కూడా బంగారం ధరలు పెరుగుదలకు ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే రూపాయి బలపడటం కోసం బంగారాన్ని దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం, ఇటీవల బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ మీద పన్నులు పెంచడం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి.