బంగారం ధరలకు రెక్కలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.900లు పెరగింది. వెండి కూడా కిలోపై రూ.1900 లు పెరిగింది.

Update: 2022-11-07 03:41 GMT

భారత్ లో బంగారం అంటేనే అందరికీ మోజు. ముఖ‌్యంగా మహిళలు బంగారం అంటే ఇష్టపడతారు. ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మక్కువ చూపుతారు. అందుకే బంగారానికి ఎప్పుడూ భారత్ లో డిమాండ్ ఉంటుంది. డిమాండ్ కు తగినట్లుగా ఆభరణాల డిజైన్లను తయారు చేసి ఆకర్షిస్తుంటాయి వ్యాపార సంస్థలు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీ మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులుంటాయని నిపుణులు చెబుతుంటారు. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారీగానే పెరుగుతున్నా కొనుగోలుదారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. కొనగోళ్లు ఏమాత్రం ఆగడం లేదు.

వెండి ధర కూడా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.900లు పెరగింది. వెండి కూడా కిలోపై రూ.1900 లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,280 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,000 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధరపై రూ.1900 లు పెరిగి ప్రస్తుతం ధర 66,300 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News