షాకింగ్ : భారీగా పెరిగన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాము బంగారంపై 200 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై రూ.900 పెరిగింది
బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్లే కనపడుతుంది. వరసగా నాలుగు రోజుల నంుచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం, వెండి అంటే భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. ప్రతి ఇంట్లో బంగారం ఒక వస్తువుగా ఉండటంతో దానికి డిమాండ్ అధికంగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. అయినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. బంగారం ఒకప్పుడు అపురూపంగా చూసేవారు. కానీ నేడు అది అవసరంగా మారిపోయింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు.
వెండి కూడా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాము బంగారంపై 200 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై రూ.900 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,950 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,450 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర గత నాలుగు రోజుల నుంచి ఆరువేల వరకూ పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 71,600 రూపాయలకు చేరుకుంది.