షాకింగ్ : పసిడిప్రియులకు నిరాశ

దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం పై రూ.250లు పెరిగింది

Update: 2023-02-07 02:53 GMT

బంగారం ధరల్లో ప్రతి రోజూ మార్పు కనపడుతుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం, వెండి ధరల పెరుగుదల ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిజానికి గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొనుగోలుదారులకు షాక్ లు ఇస్తూనే ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత ధరలు మరింత పెరిగాయి. ఈ ఏడాది తులం బంగారం ఎనభై వేలకు చేరినా ఆశ్చర్యం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా బంగారం కొనుగోళ్లు ఆగడం లేదు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తుండటంతో డిమాండ్ తగ్గడం లేదు. రూపాయి బలపడటం కోసం కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించినందున ధరలు పెరుగుతున్నాయన్న అంచనా కూడా వినపడుతుంది.

నిలకడగా వెండి...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం పై రూ.250లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,650 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,440 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 74,000 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News