బ్యాడ్ న్యూస్ .. గోల్డ్ రేట్స్ ఇలా

దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2022-08-27 02:17 GMT

బంగారం ధరలు ఎక్కువ సార్లు పెరుగుతాయి. అతి తక్కువ సార్లు మాత్రమే తగ్గుతాయి. ఇది పసిడి ప్రియుయులకు అందరికీ తెలిసిన విషయమే. అందుకే పసిడి కొనుగోలుదారులు ధరలను పట్టించుకోవడం ఎన్నడో మానేశారు. తమ వద్ద డబ్బులు ఉన్నప్పుడే కొనుగోలు చేయడం మేలని భావిస్తున్నారు. భారత్ లో పసిడి కున్న డిమాండ్ మరే వస్తువుకు లేదు. భూమి తర్వాత అత్యంత విలువైన వస్తువుగా బంగారాన్ని భావిస్తారు. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు కొనసాగుతుంటాయి. అందుకే భారత్ లో గోల్డ్ కు అంత డిమాండ్ ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు వంటి కారణాలతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. పసిడి తగ్గినప్పుడే కొనుగోలు చేద్దాం అనే వారి సంఖ్య తగ్గుతుండటంతో వాటికి డిమాండ్ పెరుగుతూ వస్తుంది.

వెండి స్థిరంగా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,980 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో 61,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News