వామ్మో ఇక ఆగేట్లులేవుగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం పై రూ.200లు పెరిగింది.

Update: 2023-01-06 03:49 GMT

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారతీయుల వీక్ నెస్ ను ఆధారంగా చేసుకుని ధరలను పెంచుతున్నారన్న అభిప్రాయమూ లేకపోలేదు. భారతీయులు బంగారం అంటే ఇష్టపడతారు. ఎంతగా అంటే.. తమ ఒంటి మీద బంగారం ఎంత ఉంటే అంత అదృష్టమని భావిస్తారు. తమకు ఉన్నంతలో కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటుగా మారింది. మహిళలు ఎక్కువగా తమ ఆభరణాలు బంగారానివే ఉండాలని కోరుకుంటారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పండగలు, పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా మారింది. అందుకే బంగారానికి భారత్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

స్థిరంగా వెండి ధరలు...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం పై రూ.200లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,960 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,300 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం75.500 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది.


Tags:    

Similar News