కొనుగోలుదారులకు షాక్

దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.170లు పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది

Update: 2022-12-23 03:43 GMT

బంగారం అంటే అంతే మరి. పెరుగుదలే కాని.. తగ్గుదల అనేది అతి కొద్దిసార్లు వింటాం. బంగారానికి దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ అలాంటిది. పడతులు తమకు ఇష్టమైన వస్తువు ఏది అంటే ఠక్కున చెప్పేది తొలుత బంగారాన్నే. బంగారం ఎంత ఉంటే అంత గౌరవంగా భావిస్తారు. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తుంది. అలాంటిది బంగారం ఇప్పుడు అందని పండుగా మారింది. ధరలు పెరగడంతో సామాన్యులకు దూరమయింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.

స్థిరంగా వెండి...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.170లు పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,820 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,250 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి హైదరాబాద్ మార్కెలో 74,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News