కొత్త ఏడాది.. తొలి రోజు.. గోల్డ్ రేట్స్

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.270లు పెరిగింది.

Update: 2023-01-01 02:53 GMT

బంగారానికి ఒక రోజు అంటూ ఏమీ లేదు. కొత్త ఏడాది మొదటి రోజు అని మొహమాటం ఎంత మాత్రం లేదు. దాని డిమాండ్ ప్రకారం ధరలు ఎగబాకుతుంటాయి. కొత్త ఏడాది బంగారం పది గ్రాములు అరవై వేల రూపాయలకు చేరుకునే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. దాని ప్రకారం కొత్త ఏడాది తొలి రోజే బంగారం, వెండి ధరలు పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి ఎప్పుడూ డిమాండ్ అధికంగానే ఉంటుంది. అయితే ధరలు పెరిగే కొద్దీ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలుకు కొంత ఆలోచిస్తారు. ఇప్పటికే మధ్యతరగతికి అందనంత దూరంలో ధరలు పెరిగాయి. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతుండటంతో ఇక బంగారం కొందరి వస్తువుగానే మారనుంది.

వెండి ధరలు కూడా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.270లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,600 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,200 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,300 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News