భారీగా పెరిగిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.290లు పెరిగింది.

Update: 2022-12-10 01:38 GMT

బంగారం అంటేనే అంత. ఒకరోజు తగ్గి వినియోగదారులను ఊరిస్తాయి. మరొకరోజు స్థిరంగా కొనసాగుతాయి. ఆ తర్వాత రోజు భారీగా పెరుగుతాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి ఎప్పుడూ డిమాండ్ అధికంగానే ఉంటుంది. ప్రతి భారతీయ మహిళ బంగారాన్ని ఎంతో కొంత కొనుగోలు చేయాలని కోరుకుంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.

ఎంత పెరిగిందంటే?
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.290లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,750 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,280 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 72,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News