గోల్డ్ న్యూస్... అంటే ఇదే

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.330ల వరకూ పెరిగింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.600 తగ్గింది.

Update: 2022-11-03 02:16 GMT

అంతే మరి. నిన్నటి వరకూ స్థిరంగా, తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. అందుకే బంగారం అంటేనే నిలకడలేనిదిగా భావిస్తారు. నిన్నటి రేటు ఈరోజు ఉండదు. ఈరోజు ధర రేపు ఉండదు. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు కూడా సూచిస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నది మార్కెట్ నిపుణుల అంచనా. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకుల, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయ తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భారత్ లో మహిళలు బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత మరే వస్తువుకు ఉండదు. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

తగ్గిన వెండి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.330ల వరకూ పెరిగింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.600 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,110 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,850 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 64,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News