పసిడిప్రియులకు భారం

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగానే పెరుగుదల కనిపించింది.

Update: 2023-04-13 04:40 GMT

బంగారం ఉంటే చాలు గౌరవం దానంతట అదే దొరుకుతుంది. సమాజంలో విలువ దక్కుతుంది. అదీ దక్షిణ భారతదేశంలో ఉన్న మహిళల అభిప్రాయం అందుకే బంగారానికి దక్షిణాది రాష్ట్రాల్లో అంత డిమాండ్. ఎక్కడా లేని విధంగా ఇక్కడే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. అందుకే వీధికొక జ్యుయలరీ షాపు కనపడుతుంది. ధరలు ఎంత పెరిగినా సరే తమ మెడలో బంగారం ఉండి తీరాల్సిందేనంటారు మహిళలు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలకు భారతీయ సంస్కృతిలో బంగారం పెట్టడం ఒక సంప్రదాయంగా వస్తుంది. అందుకే పెళ్లిళ్ల సీజన్ లో జ్యుయలరీ షాపులు కిటకిటలాడుతుంటాయి. బంగారం ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా ఈ సీజన్ అంతా కొనుగోళ్లు ఉంటాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అందుకే కొత్త కొత్త డిజైన్లతో, వాణిజ్య ప్రకటనలతో కొనుగోలు దారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

భారీగా పెరిగిన వెండి...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగానే పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై రూ.500లు పెరిగింది. కిలో వెండి ధర పై రూ.750లు పెరగడం విశేషం. దీంతో బంగారం, వెండి రెండూ భారీగానే పెరిగినట్లయింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,200 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,310 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 81,400 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News