బంగారం మరింత ప్రియం

దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. తులం బంగారం ధరపై వంద రూపాయలు పెరిగింది. వెండి ధరలు మాత్రం నేటికీ స్థిరంగా ఉన్నాయి

Update: 2023-03-01 04:03 GMT

బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతుండటంతో పసిడి ప్రియులు సంతోష పడ్డారు. ఆ సంతోషం ఎన్నో రోజులు ఉండలేదు. మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, డాలర్ తో రూపాయి విలువ తగ్గుదల వంటి కారణాలు బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుతుండటంతో అందరరూ సంతోషపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. దిగుమతులను తగ్గించడం వల్ల కూడా డిమాండ్ పెరిగి బంగారం ధరలు ప్రియమైపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

స్థిరంగా వెండి ధరలు...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగింది. వెండి ధరలు మాత్రం నేటికీ స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,450 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,120 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 69,200 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News