బంగారం కొనాలనుకుంటున్నారా? షాకింగ్ న్యూస్

దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 150 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర కొంత తగ్గింది

Update: 2023-03-02 03:51 GMT

బంగారం అంటే అంతే మరి. తగ్గుతాయని సంతోషపడేలోపు పెరగడం కూడా అంతే వేగంగా జరిగిపోతుంది. బంగారం ధరలు ఎప్పడూ నిలకడగా ఉండవు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంపు, దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. పసిడి కొనాలంటే సామాన్యలకు భారంగా మారిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. పెట్టుబడిగా చూసేవారు సయితం బంగారం కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. బంగారానికి గతంలో ఉన్న డిమాండ్ కూడా తగ్గిందని చెబుతున్నారు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు మినహాయించి మిగిలిన సమయంలో జ్యుయలరీ దుకాణాల వైపు చూడటం మానుకున్నారు.

తగ్గిన వెండి ధర...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 150 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర కొంత తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,290 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 70,200 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News