ఈరోజు బంగారం కొనాలంటే ధరలు ఇవే

దేశంలో బంగారం నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన ధరలు నేడు పెరగలేదు

Update: 2022-09-19 02:35 GMT

బంగారు ఆభరణాలు మహిళల దేహానికి కొత్త శోభనిస్తాయి. బంగారం ఉంటే దాని విలువే వేరు. అందుకే బంగారం అంటే మగువలు అంతగా ఇష్టపడతారు. బంగారాన్ని ఒకప్పుడు విలువైన వస్తువుగా చూసే వారు. ఇప్పుడూ అంతే అయినా కొనుగోలు సులువుతరం కావడంతో పెద్దగా లెక్క చేయడం లేదు. ధరలు, సీజన్లతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేస్తుంటారు. బంగారం ధరల విషయంలో మాత్రం ఎవరూ స్పష్టంగా ఇన్ని రోజులు ఇదే ధర ఉంటుంది చెప్పలేరు. ప్రతి రోజూ ధరల్లో మార్పు ఉంటుంది. కేంద్రీయ బ్యాంకుల వద్ద నిల్వలు, డాలర్ తో రూపాయి విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు వంటివి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. వాటితో సంబంధం లేకుండానే ధరలను చూడకుండానే తమ వద్ద డబ్బులున్నప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువయింది. అందుకే జ్యుయలరీ దుకాణాలు కూడా ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి.

స్థిరంగా ధరలు....
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన ధరలు నేడు పెరగలేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,130 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,950 రూపాయలు ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 62,000 రూపాయలు పలుకుతుంది.


Tags:    

Similar News