గోల్డ్ లవర్స్ ఈ న్యూస్ వింటే?

దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా పెరగకపోవడం కొనుగోలు దారులకు ఊరట

Update: 2023-04-28 04:04 GMT

పసిడి ధరలు ఎప్పుడూ ఆకాశాన్నంటుతుంటాయి. ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతుండటంతో ఎప్పటికప్పుడు ధరలు పెరిగినా పట్టించుకునే వారు లేరు. అయితే ధరలు ఎక్కువ అని కొనుగోలు చేయకుండా ఉండలేరు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే అంతే. ఏ శుభకార్యానికైనా దక్షిణాది రాష్ట్రంలో బంగారం కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీ. సంప్రదాయం. పెద్దలు పెట్టిన సంప్రదాయలను ఇప్పటికీ పాటిస్తుండటంతో బంగారానికి గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. అలాగే కష్టకాలంలో అది తమ తోడు ఉంటుందన్న నమ్మకంతో బంగారం కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. అందుకే బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ పెట్టుబడి కోసం కూడా కొందరు కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు.

వెండి కూడా....
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా పెరగకపోవడం కొనుగోలు దారులకు ఊరట. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,950 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,040 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 80,200లుగా నమోదయింది.


Tags:    

Similar News