బంగారం కొనాలనుకునే వారికి..?

దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి

Update: 2022-12-19 02:52 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. అలాగే తగ్గుతాయని అనుకోలేం. అలాగని కొనకుండా ఉండలేం. బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. బంగారం అందరికీ అందుబాటులో ఉండాల్సిన వస్తువు కాదు. అవసరమైనది అంతకంటే కాదు. భారతీయ మహిళలు అత్యంతగా ఇష్టపడే బంగారం ధరలు పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా ఉంటాయి. అప్పుడప్పుడు స్థిరంగా కొనసాగుతాయి. అయినా అవసరాన్ని బట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ అధికంగానే ఉంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.

పెరిగిన వెండి ధరలు...
తాజాగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,490 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,950 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 73,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News