గ్రేట్ రిలీఫ్.. గోల్డ్ రేట్స్...?

దేశంలో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

Update: 2023-05-03 04:32 GMT

బంగారం అంటేనే మగువలకు క్రేజ్. అదొక స్టేటస్ సింబల్. బంగారు ఆభరణాలను మెడలో వేసుకుంటే సమాజం గౌరవిస్తుందని భావించి ఏ మాత్రం వెసులు బాటు ఉన్నా బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువగా మహిళలు మొగ్గు చూపుతారు. అయితే పెరుగుతున్న ధరలు వారి ఆశలను అణిచివేస్తున్నా.. ఉన్నంతలో కొనుగోలు చేయడం మాత్రం మానుకోరు. మార్కెట్‌లోకి కొత్త కొత్త డిజైన్లు వస్తుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఎగబడి మరీ కొంటుంటారు. కొందరు బంగారాన్ని పెట్టుబడిగా చూస్తుంటారు. మరికొందరు మాత్రం అవసరానికి పనికివచ్చే వస్తువుగానూ భావిస్తారు. వెరసి బంగారం కొనుగోలు చేయడం మాత్రం మామూలుగా మారిపోయింది. అందుకే పసిడికి భారత్ లో ఉన్న డిమాండ్ ఎక్కడా లేదు. అందునా దక్షిణ భారత దేశంలో ఎక్కువగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుండటం సంప్రదాయంగా మారింది.

పెరిగిన వెండి...
తాజాగా దేశంలో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది పసిడి ప్రియులకు ఊరట కలిగించే అంశమే. ఇక వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. వెండి కిలో పై రూ.100లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,700 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,760 రూపాయల వద్ద నిలకడగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 80,500 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News