నేటి గోల్డ్ రేట్స్ ఇలా

దేశంలో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Update: 2023-05-02 03:32 GMT

బంగారం అంటే ఎప్పుడూ ప్రియంగానే ఉంటుంది. బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గేది తక్కువ. పెరిగేది ఎక్కువ సార్లు. వారంలో అనేక సార్లు ధరలు పెరుగుతూనే ఉంటాయి. అయినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ప్రతి ఇంట సంస్కృతి, సంప్రదాయాలకు శుభసూచికంగా మారడంతో కొనుగోళ్లు మాత్రం ఎంత ధరలు ఉన్నా కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. పండగలు, శుభాకార్యక్రమాలకు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా మారింది. అందులో దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఎక్కువగా కనపడుతుంది. మిగిలిన చోట్ల గోల్డ్ బాండ్లు కొనుగోలు చేస్తున్నా ఇక్కడ మాత్రం బంగారు ఆభరణాలకే ప్రాధాన్యత ఇస్తారు.

ధరలు ఇలా...
తాజాగా దేశంలో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పది గ్రాముల బంగారంపై రూ.170లు తగ్గింది. కిలో వెండి ధరపై రూ200లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,420 రూపాయలు పలుకుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 80,200 రూపాయలుగా నమోదయి ఉంది.


Tags:    

Similar News