సండే... సూపర్ డే
దేశంలో బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. భారీగానే బంగారం ధరలు తగ్గాయి.వెండి ధరలు కూడా తగ్గాయి
బంగారం ధరలు తగ్గితే అంతకన్నా ఆనందం మరేదీ ఉండదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరుగుతుంటాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మహిళలు బంగారు ఆభరణాలంటేనే మక్కువ చూపుతుండటంతో కొనుగోళ్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి. పెళ్లిళ్లకు, శుభకార్యక్రమాలకు బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉండటంతో బంగారానికి ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దిగుమతులు తగ్గించడం, కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో బంగారం ధరలు పెరుగుతాయంటున్నారు.
వెండి కూడా...
తాజాగా దేశంలో బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. భారీగానే బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.700లు తగ్గింది. దీంతో మహిళలకు ఊరటకల్గించే వార్త అని చెప్పాలి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,500 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,40 రూపాయలకు చేరుకుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 82,400 రూపాయలు పలుకుతుంది.