గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం

దేశంలో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే పది గ్రాములపై రూ.500ల వరకూ తగ్గింది

Update: 2022-08-02 02:40 GMT

బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు షరా మామూలే. ఎప్పడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులను బట్టి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో పాటు ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే బంగారం కొనుగోళ్లు మాత్రం ఎంత ధరలు పెరిగినా ఆగవు. ఎందుకంటే అది భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. ధర తగ్గినప్పుడు పెరుగుతాయని కొనుగోళ్లను ఆపే రోజులు కావివి. చేతిలో డబ్బులు ఎప్పుడుంటే అప్పడు కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. ఇక బంగారాన్ని పెట్టుబడిగా చూస్తుండటం కూడా దానికి డిమాండ్ పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా...
తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే పది గ్రాములపై రూ.500ల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,380 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,100 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి 63,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News