గుడ్ న్యూస్... తగ్గిన బంగారం

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై 110 రూపాయలు తగ్గింది.

Update: 2022-07-28 02:04 GMT

బంగారం అంటేనే భారతీయులకు మహా ప్రీతి. ఎంత ధరలు పెరిగినా వాటి కొనుగోళ్లు మాత్రం ఆగవు. అందుకే వీధికొక్క జ్యుయలరీ షాపు వెలుస్తుంది. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారాన్ని కేవలం ఆభరణాలను మాత్రమే కాకుండా పెట్టుబడిగా చూస్తుండటంతోనే బంగరం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. వచ్చేది శ్రావణ మాసం కావడంతో కొనుగోళ్లు మరింత పెరుగుతాయని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు బంగారం ధరల్లో మార్పుకు కారణంగా మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడు బంగారం ధర తగ్గినా కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

స్వల్పంగానైనా....
తాజాగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం పై 110 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,680 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,450 రూపాయలు ఉంది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 60 వేల రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News