పసిడి ధరలు తగ్గాయ్.. కానీ?
తాజాగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ300లు తగ్గింది. వెండి మాత్రం పెరిగింది.
బంగారం ధరల్లో ప్రతి రోజూ మార్పులు జరుగుతుంటాయి. ఎక్కువ సార్లు ధరలు పెరుగుతూనే ఉంటాయి. ధరలు పెరిగినప్పుడు ఆందోళన చెందడం ఎంత సహజమో.. తగ్గినప్పుడు కూడా సంతోషపడటం అంతే సహజం. పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిందనుకున్న బంగారం ధరలు తగ్గాయంటే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు? కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని భావిస్తున్నారు.
వెండి మాత్రం...
ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ300లు తగ్గింది. వెండి మాత్రం పెరిగింది. కిలో వెండి ంద రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,700 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,670 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 77,100 రూపాయలుగా ఉంది.