గోల్డ్ కొనేందుకు గుడ్ టైమ్
తాజాగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కూడా అంతే. పది గ్రాముల బంగారం పై 180 రూపాయలు తగ్గింది
దేశంలో బంగారం ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. ప్రతి రోజూ మారుతుంటాయి. అనేక కారణాలతో ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. భారతీయ మగువలను కట్టిపడేసే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో ధరల్లో హెచ్చు, తగ్గుదల కనిపిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. బంగారం పెరిగినప్పడు ఎక్కువగానూ, తగ్గినప్పుడు స్వల్పంగానూ ధర ఉండటం సహజమే. అందుకే బంగారం కొనుగోలు విషయంలో ధరలను పెద్దగా పట్టించుకోరు. తమకు నచ్చిన డిజైన్ మార్కెట్ లో కనిపించినప్పుడు కొనుగోలు చేస్తుంటారు. అలాగని డిజైన్ల విషయంలో ఎట్టిపరిస్థితులలో రాజీపడరు. అందుకే మార్కెట్ లో వివిధ రకాల డిజైన్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు అన్ని షాపులు ప్రయత్నిస్తుంటాయి. కార్తీకమాసం కూడా ప్రవేశించడంతో కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు ఆశిస్తున్నారు.