శుభవార్త...భారీగా తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. వెండి కూడా భారీగానే తగ్గింది. పది గ్రాముల బంగారంపై రూ.380 ల వరకూ తగ్గింది

Update: 2022-10-30 02:39 GMT

gold silver rates in hyderabad

బంగారానికి భారత్ లో ఇచ్చిన ప్రాధాన్యత మరెక్కడా ఇవ్వరనే చెప్పాలి. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయి. వాటిని ఎప్పడికప్పడు బేరీజు వేసుకుని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బంగారం ధర పెరిగినా పెద్దగా ఇబ్బంది పడని రోజులివి. ఎందుకంటే తమ వద్ద డబ్బు ఉన్నప్పుడే కొనుగోలు చేయడానికి ఏ మాత్రం మగువలు వెనకాడరు. దీంతో పాటు జ్యుయలరీ షాపులు ఇస్తున్న ఈఎంఐల పథకాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. నెలవారీ కొంత మొత్తం కడుతూ బంగారాన్ని తమ సొంతం చేసుకునే వీలుంది. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ, తగ్గుతూ వస్తాయి.

భారీగా తగ్గిన వెండి....
దేశంలో బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. వెండి కూడా భారీగానే తగ్గింది. పది గ్రాముల బంగారంపై రూ.380 ల వరకూ తగ్గింది. వెండి ధర 800 రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,000 రూపాయల వరకూ పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,750 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 63,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News