గోల్డ్ ధరలు ఈరోజు ఎలా ఉందంటే?

బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి.

Update: 2023-04-10 05:04 GMT

బంగారం ధరలు అందకుండా పోతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం భారంగా మారనుంది. ఎప్పుడూ పెరగడమే. పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా బంగారం ధరలు ఉండటం సర్వసాధారణమయి పోయింది. కొందరు దీనికి అలవాటు పడి పోగా, మరికొందరు బంగారానికి దూరమవుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం వంటి సమస్యల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం సంప్రదాయంగా మారింది. మిగిలిన ప్రాంతాలు, దేశాల్లో గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తుంటారు. కానీ ఆభరణాలు కొనుగోలు చేసే వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.

ధరలు ఇవీ...
తాజాగా బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,970 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,860 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 80,200 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News